గోప్యతా విధానం

చివరిగా నవీకరించినది: 28 అక్టోబర్ 2026

BVT Grama Connect మీ పంచాయతీ, స్థానిక పరిపాలన ధృవీకరించిన గ్రామ ప్రకటనలను మీ ఫోన్‌కు అందిస్తుంది. మేము ఏ సమాచారం సేకరిస్తాం, ఎందుకు, దాని గురించి మీరు ఏం చేయవచ్చో ఈ పేజీ సులభమైన మాటల్లో చెబుతుంది. పౌరులు ఖాతా లేకుండానే యాప్ వాడవచ్చు.

తెలుగు, ఇంగ్లీష్ పాఠాల్లో తేడా ఉంటే ఇంగ్లీష్ పాఠమే చెల్లుతుంది.

1.మేము సేకరించేవి

  • వార్తలు చదవడం: మిమ్మల్ని గుర్తించే సమాచారం ఏదీ లేదు. మీ భాష, గ్రామం, సేవ్ చేసిన పోస్టులు, అక్షరాల పరిమాణం మీ ఫోన్‌లోనే ఉంటాయి.
  • లొకేషన్ (ఐచ్ఛికం): మీరు అనుమతిస్తే, మీకు దగ్గరలోని గ్రామం కనుగొనడానికి యాప్ మీ స్థానాన్ని ఒక్కసారి పంపుతుంది. దాన్ని మేము దాచుకోము.
  • సేవల అభ్యర్థనలు: మీ పేరు, మొబైల్ నంబర్, ఐచ్ఛికంగా ఈమెయిల్, సేవ, మీరు రాసిన వివరాలు, మీ గ్రామం.
  • ఈ వెబ్‌సైట్‌లోని సంప్రదింపు ఫారం: మీ పేరు, మొబైల్ నంబర్, గ్రామం లేదా మండలం, మీ సందేశం, స్పామ్ ఆపడానికి మీ ఇంటర్నెట్ (IP) చిరునామా.
  • యాప్ నుంచి పోస్ట్ చేయడం: ఒక ఫోన్ మొదటిసారి పోస్ట్ చేసినప్పుడు, Google Play Integrity తనిఖీ తర్వాత దానికి ఒక ప్రైవేట్ పోస్టింగ్ కీ ఇస్తాం. ఆ కీ, పరికర ID, IP చిరునామాలను మార్చిన (హ్యాష్ చేసిన) రూపంలో మాత్రమే, మీ గ్రామం, భాష, యాప్ వెర్షన్, మీరు రాసిన పోస్టులతో పాటు ఉంచుతాం.
  • నోటిఫికేషన్లు: మీరు ఆన్ చేస్తే, పోస్ట్ ప్రచురితమైనప్పుడు తెలియజేయడానికి ఒక నోటిఫికేషన్ టోకెన్.
  • అధికారులు (పంచాయతీ సభ్యులు, అడ్మిన్లు): యూజర్‌నేమ్, పేరు, మొబైల్ నంబర్, ఐచ్ఛికంగా ఈమెయిల్, పాత్ర, ప్రాంతం. పాస్‌వర్డ్‌లు హ్యాష్ రూపంలో మాత్రమే ఉంటాయి. ప్రతి సమీక్ష చర్య ఆడిట్ లాగ్‌లో నమోదవుతుంది.

2.ఎందుకు వాడతాం

  • మీ గ్రామ వార్తలు చూపడానికి, నోటిఫికేషన్లు పంపడానికి.
  • మీ సేవల అభ్యర్థనను మీ గ్రామ అధికారులకు చేర్చడానికి, వారు మిమ్మల్ని సంప్రదించడానికి.
  • మీ సందేశానికి జవాబివ్వడానికి.
  • సేవను సురక్షితంగా ఉంచడానికి: స్పామ్ ఆపడం, దుర్వినియోగాన్ని కొంతకాలం నిరోధించడం, అధికారుల చర్యల రికార్డు ఉంచడం.

మీ సమాచారాన్ని మేము అమ్మము, ప్రకటనల ప్రొఫైల్స్ కోసం వాడము. యాప్‌లో కనిపించే బ్యానర్లను అడ్మిన్లు పెడతారు; అవి మిమ్మల్ని ట్రాక్ చేయవు.

3.ఎవరు చూడగలరు

  • సేవల అభ్యర్థనలు: మీ గ్రామ అధికారులు, అభ్యర్థనలు చూసే పై స్థాయి అడ్మిన్లు.
  • సంప్రదింపు సందేశాలు: మా సహాయ బృందం.
  • ప్రచురించిన పోస్టులు ఆ గ్రామాన్ని ఎంచుకున్న అందరికీ కనిపిస్తాయి.
  • మేము ఆధారపడే సేవా సంస్థలు: మా హోస్టింగ్ సంస్థ, Google (Play Integrity తనిఖీ, యాప్ పంపిణీ, ఈ వెబ్‌సైట్ ఫాంట్లు). ఆ సేవకు అవసరమైనంత మాత్రమే వారికి అందుతుంది.
  • చట్టం కోరినప్పుడు సంబంధిత అధికార సంస్థలు.

4.మీ ఫోన్‌లో, బ్రౌజర్‌లో

  • “వినండి” (చదివి వినిపించడం) మీ ఫోన్ లేదా బ్రౌజర్ సొంత వాయిస్‌తో జరుగుతుంది; ఆ పాఠం మాకు రాదు.
  • పోస్ట్ షేర్ చేయడం మీరు ఎంచుకున్న యాప్ (ఉదా: వాట్సాప్) ద్వారా జరుగుతుంది.
  • ఈ వెబ్‌సైట్ ట్రాకింగ్ కుకీలు పెట్టదు. కన్సోల్‌లో లాగిన్ అయ్యే అధికారులకు మాత్రమే లాగిన్ (సెషన్) కుకీ ఉంటుంది; 30 నిమిషాలు వాడకపోతే అది ముగుస్తుంది.

5.ఎంతకాలం ఉంచుతాం

పైన చెప్పిన పనికి అవసరమైనంత కాలం మాత్రమే: అభ్యర్థనలు, సందేశాలు పరిష్కారమయ్యే వరకు, ఆ తర్వాత రికార్డుల కోసం తగిన కాలం; అధికారుల ఖాతాలు ఆ పదవిలో ఉన్నంత కాలం. ఫోన్‌పై నిరోధం దానంతట అదే ముగుస్తుంది. మీ సమాచారం తొలగించమని ఎప్పుడైనా అడగవచ్చు.

6.మీ హక్కులు

భారత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం, 2023 ప్రకారం, మీ వ్యక్తిగత డేటాను చూడమని, సరిచేయమని, తొలగించమని అడగవచ్చు; ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవచ్చు. help@bvtgramaconnect.in కు రాయండి లేదా సంప్రదించండి పేజీ వాడండి. 2 పని దినాల్లో మీ అభ్యర్థన అందినట్లు తెలియజేస్తాం.

7.భద్రత

అనుమతి ఉన్న అధికారులు మాత్రమే ఈ సమాచారం చూడగలరు. పాస్‌వర్డ్‌లు, పరికర వివరాలు హ్యాష్ రూపంలో ఉంటాయి. ప్రతి అధికారిక చర్య నమోదవుతుంది.

8.మార్పులు

ఈ విధానాన్ని మార్చితే, ఈ పేజీని, పైన ఉన్న తేదీని నవీకరిస్తాం.

9.సంప్రదించండి

గోప్యత గురించి ప్రశ్నలు లేదా ఫిర్యాదులు: help@bvtgramaconnect.in · +91 863 223 4567 · లేదా సంప్రదించండి పేజీ.